పంజాగుట్ట, వెలుగు: జూబ్లీహిల్స్ హౌజింగ్ సొసైటీ ఎన్నికలు ఆదివారం ప్రశాంతంగా ముగిశాయి. సొసైటీలో 4,039 ఓట్లు ఉండగా 1,814 ఓట్లు పోలయ్యాయి. అత్యంత ధనవంతులు, చదువుకున్నవారు ఉండే ప్రాంతంగా పేరొందిన జూబ్లీహిల్స్ సొసైటీ ఎన్నికల్లో అతి స్వల్పంగా ఓట్లు పోలవ్వడం అభ్యర్థులను కలవరపెడుతోంది. కోర్టు తీర్పు మేరకు 8 వారాల అనంతరం ఫలితాలను విడుదల చేసే అవకాశం ఉందని నిర్వాహకులు తెలిపారు.
