అమ్మకానికి ఎన్‌‌‌‌ఎస్‌‌‌‌ఈలో ఒక శాతం ఎస్‌‌‌‌బీఐ వాటా

అమ్మకానికి ఎన్‌‌‌‌ఎస్‌‌‌‌ఈలో ఒక శాతం ఎస్‌‌‌‌బీఐ వాటా

న్యూఢిల్లీ: నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్‌‌‌‌ఎస్‌‌‌‌ఈ) ఐపీఓలో తమ వాటాలో ఒక శాతం వరకు వాటాను అమ్ముతామని ఎస్‌‌‌‌బీఐ ప్రకటించింది. ఎన్‌‌‌‌ఎస్‌‌‌‌ఈ ఐపీఓ ద్వారా రూ. 30 వేల కోట్లు సేకరించే అవకాశం ఉంది. ఎస్‌‌‌‌బీఐ, సబ్సిడరీ కంపెనీ ఎస్‌‌‌‌బీఐ క్యాపిటల్ మార్కెట్స్ కలిసి ఈ ఒక శాతం  వాటాను విక్రయిస్తాయని బ్యాంక్ చైర్మన్ సి.ఎస్.శెట్టి తెలిపారు. 

ఈ బ్యాంక్‌‌ 0.65శాతం, ఎస్‌‌‌‌బీఐ క్యాప్స్‌‌ 0.35శాతం వాటాను ఎన్‌‌‌‌ఎస్‌‌‌‌ఈలో తగ్గించుకోనున్నాయి.  ప్రస్తుతం ఎన్‌‌‌‌ఎస్‌‌‌‌ఈలో స్టేట్‌‌ బ్యాంక్‌‌కు 3.23శాతం, ఎస్‌‌‌‌బీఐ క్యాప్స్‌‌‌‌కు 4.33శాతం వాటా ఉంది. ఇతర సబ్సిడరీల్లో వాటాలు అమ్మి డబ్బులు సేకరించే ఆలోచన  ప్రస్తుతం లేదని శెట్టి స్పష్టం చేశారు.