సీజేఐ గా ప్రమాణ స్వీకారం చేసిన జస్టిస్ బోబ్డే

సీజేఐ గా ప్రమాణ స్వీకారం చేసిన జస్టిస్ బోబ్డే

సుప్రీం కోర్టు 47 వ ప్రధాన న్యాయమూర్తిగా శరద్ అర్వింద్ బోబ్డే ప్రమాణ స్పీకారం చేశారు. రాష్ట్రపతి రామ్ నాథ్  కోవింద్ ఆయన చేత ప్రమాణం చేయించారు. బోబ్డే  17 నెలల పాటు సుప్రీం చీఫ్ జస్టిస్ గా ఉండనున్నారు. ఏప్రిల్ 13, 2021 న ఆయన రిటైర్ కానున్నారు.అయోధ్యలో భూవివాదం, రైట్ టు ప్రైవసీ వంటి చరిత్రాత్మకమైన తీర్పులను వెలువరించిన బెంచ్ లలో జస్టిస్ బోబ్​డే కీలక పాత్ర పోషించారు.

బోబ్డే ప్రొఫైల్

  • మహారాష్ట్ర లోని నాగ్​పూర్ లో 1956 ఏప్రిల్ 24న పుట్టారు
  • తండ్రి లాయర్ అరవింద్ శ్రీనివాస్ బోబ్​డే
  • నాగ్​పూర్ యూనివర్సిటీ నుంచి బీఏ, ఎల్ ఎల్ బీ
  • 1978లో మహారాష్ట్ర బార్ కౌన్సిల్ లో లాయర్ గా రిజిస్టర్​ చేసుకున్నారు
  • 21 ఏళ్లపాటు లాయర్ గా సేవలు
  • 1998లో సీనియర్ అడ్వకేట్ గా ప్రమోషన్​
  • 2000 మార్చి 29న బాంబే హైకోర్టు లో అడిషనల్ జడ్జిగా బాధ్యతలు
  • 2012 అక్టోబర్ 16న మధ్యప్రదేశ్ హైకోర్టు సీజేగా ప్రమాణం
  • 2013 ఏప్రిల్ 12న సుప్రీంకోర్టు జడ్జిగా ప్రమోషన్​