ఈఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీ సభ్యులుగా రఘు, శ్రీనివాసరావు ప్రమాణం

ఈఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీ సభ్యులుగా రఘు, శ్రీనివాసరావు ప్రమాణం

హైదరాబాద్, వెలుగు: ఈఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీ సభ్యులుగా కె.రఘు, సి.శ్రీనివాసరావు ప్రమాణ స్వీకారం చేశారు. సోమవారం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని విద్యుత్ నియంత్రణ భవన్ కాన్ఫరెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (టీజీఈఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీ) చైర్మన్ జస్టిస్ డి.నాగార్జున్ ఆధ్వర్యంలో టెక్నికల్ సభ్యునిగా రఘు, ఫైనాన్స్ సభ్యునిగా శ్రీనివాసరావు ప్రమాణం చేశారు. నియామక ఉత్తర్వును ఇంధన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా చదివి వినిపించారు. 

ఈ కార్యక్రమంలో సదరన్ సీఎండీ ముషారఫ్ ఫరూకీ, నార్తర్న్ డిస్కంల సీఎండీ వరుణ్ రెడ్డి, సింగరేణి సీఎండీ బలరాం, గత ఈఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీ చైర్మన్లు, సభ్యులు, రాష్ట్ర సలహా కమిటీ (ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఏసీ), సీఈఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ చైర్మన్, విద్యుత్ రంగ సీనియర్ అధికారులు, అధికారులు, ఉద్యోగుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ సంఘాల ప్రతినిధులు నూతన సభ్యులకు అభినందనలు తెలిపారు. ఈ నియామకాలు రాష్ట్ర విద్యుత్ రంగంలో రెగ్యులేటరీ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగావిద్యుత్ అకౌంట్స్ ఆఫీసర్ల సంఘం అధ్యక్షుడు పి.అంజయ్య ఆధ్వర్యంలో ప్రతినిధులు రఘు, శ్రీనివాసరావును సత్కరించారు.