ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయండి : కె.శ్యామ్ సుందర్​రెడ్డి

ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయండి : కె.శ్యామ్ సుందర్​రెడ్డి

ఖైరతాబాద్: కేంద్ర పోలీస్​ విభాగంలో విధులు నిర్వహించి, రిటైర్డ్ అయిన తమకు ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని తెలంగాణ మాజీ సెంట్రల్ ఆర్ముడ్ పోలీస్​ఫోర్స్​పర్సనల్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు కె.శ్యామ్ సుందర్​రెడ్డి కోరారు. మంగళవారం ఆయన ఆధ్వర్యంలో సంఘ సభ్యులు మంత్రి సీతక్కను కలిసి వినతి పత్రం అందజేశారు. 

సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్, సీఐఎఫ్, ఐటీ బీపీ, ఎస్ఎస్ బీ, అస్సాం రైఫిల్స్ విభాగాల్లో విధులు నిర్వహించి పదవీ విరమణ పొందామని తెలిపారు. ఆర్మీ ఉద్యోగుల మాదిరి తమకు కూడా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు.