వెంటిలేటర్‌పై కైకాల సత్యనారాయణ

వెంటిలేటర్‌పై కైకాల సత్యనారాయణ

ప్రముఖ సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ తీవ్ర అనారోగ్యం పాలయ్యారు.దీంతో ఆయనను వెంటనే అపోలో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం కైకాల వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సత్యనారాయణ కుటుంసభ్యులకు ఫోన్‌ చేసి  ఆయన ఆరోగ్యం గురించి ఆరా తీస్తున్నారు. ఆయన క్షేమంగా తిరిగి రావాలంటూ సినీ అభిమానులు, పలువురు నెటిజన్లు సోషల్‌మీడియాలో పోస్టులు పెడుతున్నారు. గత నెల 30న కైకాల అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఇంట్లో జారిపడటంతో కుటుంబసభ్యులు అప్పుడు ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. 

కైకాల వయసు ప్రస్తుతం 88 ఏళ్లు. సత్యనారాయణ కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం కౌతరం గ్రామంలో, కైకాల లక్ష్మీనారాయణకు 1935 జూలై 25 న జన్మించాడు. ఇక సినిమాల విషయానికి వస్తే 1959లో నారాయణ సిపాయి కూతురు అనే సినిమాలో సత్యనారాయణ వెండితెరకు పరిచయం అయ్యారు.  2019లో విడుదలైన ‘ఎన్టీఆర్‌ కథానాయకుడు’, ‘మహర్షి’ చిత్రాల తర్వాత ఆయన వెండితెరకు దూరంగా ఉన్నారు.