
తెలంగాణ వ్యాప్తంగా కాకా వెంకటస్వామి 96వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అభిమానులు , ప్రజలు ఘన నివాళులు అర్పిస్తున్నారు.
హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ సాగర్ పార్కులో కాకా విగ్రహం దగ్గర మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రి వివేక్ వెంకటస్వామి, సరోజా వివేక్, సికింద్రాబాద్ మాజీ పార్లమెంట్ సభ్యులు అంజన్ కుమార్ యాదవ్ కాకా చిత్రపటానికి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమానికి పలువురు కాకా అభిమానులు . ప్రజా సంఘాల నాయకులు హాజరయ్యారు.
కాకా 96వ జయంతిని పురస్కరించుకొని హైదరాబాద్ లోని అంబేద్కర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లో 5కే రన్ ను ప్రారంభించారు బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ కుమార్. అంబేద్కర్ కాలేజ్ నుంచి ట్యాంక్ బండ్ కాకా విగ్రహం వరకు ఈ 5కె రన్ జరగనుంది.