హ్యపీ బర్త్‌డే బావా

హ్యపీ బర్త్‌డే బావా

ఆర్థిక మంత్రి హరీష్ రావుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ.. మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ట్వీట్ చేశారు. ఈ రోజు మంత్రి హరీశ్‌రావు పుట్టినరోజు. ఆయనకు పలువురు నేతలు పుట్టినరోజు విషేస్

తెలియజేస్తున్నారు. వరుసకు మరదలు అయిన కవిత.. హ్యాపీ బర్త్‌డే బావా అంటూ ట్వీట్ చేశారు. ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కూడా హరీష్ రావుకు శుభాకాంక్షలు తెలిపారు. హ్యాపీ బర్త్‌డే బావా అని తెలుపుతూ… సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ప్రజాసేవలో జీవితాంతం పనిచేయాలని కేటీఆర్ ట్వీట్ చేశారు. అలాగే ఎంపీ సంతోష్‌కుమార్‌ కూడా హ్యాపీ బర్త్‌డే బావా అని విష్ చేసి.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మూడు మొక్కలు నాటాలని కోరారు.

హరీష్ రావు జన్మదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, స్థానిక ప్రజాప్రతినిధులు, టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకర్తలు, ఇతర రంగాల ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, చేవేళ్ల ఎంపీ రంజిత్‌ రెడ్డి, తదితరులు శుభాకాంక్షలు తెలుపుతూ హరీశ్‌రావు పూర్తి ఆయురారోగ్యాలతో నిండునూరేళ్లు జీవించాలని కోరుకున్నారు.

For More News..

ఎన్టీఆర్ ఫ్యాన్ కాకపోతే.. రేప్ చేస్తారా?

ఈజీగా కొత్త అప్పులిస్తున్నస్టేట్​ బ్యాంక్​

ఈ నెల నుంచి కొత్త కరెంట్ బిల్లులు

కారు కొనాలనుకుంటున్నారా? ఇదే మంచి సమయం..