బిజినెస్ మెన్ సిద్ధార్థ్

బిజినెస్ మెన్ సిద్ధార్థ్

లాస్ట్ ఇయర్ ‘బింబిసార’తో సూపర్ సక్సెస్ అందుకున్న కల్యాణ్ రామ్.. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకుల ముందు కొచ్చేందుకు రెడీ అవుతున్నాడు.  రాజేంద్ర రెడ్డి అనే కొత్త దర్శకుడిని పరిచయం చేస్తూ ‘అమిగోస్’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. న్యూఇయర్ విషెస్ చెబుతూ.. ఇందులోని కళ్యాణ్ రామ్ క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌ను ఆదివారం రివీల్ చేశారు మేకర్స్.  సిద్ధార్థ్​ అనే బిజినెస్ మేన్‌‌‌‌గా కళ్యాణ్ రామ్ కనిపిస్తాడని ప్రకటించారు.  

టీమ్ రిలీజ్ చేసిన పోస్టర్‌‌‌‌‌‌‌‌లో స్టైలిష్ గెటప్‌‌‌‌లో ఇంప్రెస్ చేస్తున్నాడు. ఇందులో కల్యాణ్​ ట్రిపుల్ రోల్‌‌‌‌లో కనిపించనున్నాడట. ఆషిక రంగ‌‌‌‌నాథ్ హీరోయిన్. బ్రహ్మాజీ, సప్తగిరి, జయప్రకాష్, రాజశ్రీ నాయర్, సోనాక్షి వర్మ ఇతర పాత్రలు పోషిస్తున్నారు.  నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మిస్తున్నారు. ఈ యాక్షన్ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైనర్‌‌‌‌  ఫిబ్రవరి 10న విడుదల కానుంది. మరోవైపు  ‘డెవిల్’ చిత్రంలో నటిస్తున్న కళ్యాణ్ రామ్ రీసెంట్‌‌‌‌గా మూడో షెడ్యూల్‌‌‌‌ను పూర్తి చేశాడు. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్‌‌‌‌ను కూడా అనౌన్స్ చేసే చాన్స్ ఉంది.