‘అమిగోస్’ టీజర్‌‌‌‌తో మరింత బజ్ క్రియేట్ చేసిన కల్యాణ్ రామ్

‘అమిగోస్’ టీజర్‌‌‌‌తో మరింత బజ్ క్రియేట్ చేసిన కల్యాణ్ రామ్

రొటీన్ క్యారెక్టర్స్‌‌ను పక్కనబెట్టి, డిఫరెంట్ స్ర్కిప్టులను సెలెక్ట్ చేసుకుంటూ బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తున్నాడు కల్యాణ్ రామ్. కిందటేడాది ‘బింబిసార’తో బ్లాక్ బస్టర్ అందుకున్న కల్యాణ్ రామ్  ఫిబ్రవరి 10న ‘అమిగోస్’ అనే వెరైటీ కాన్సెప్ట్‌‌తో ఆడియన్స్‌‌ ముందుకొస్తున్నాడు. ఇందులో ట్రిపుల్ రోల్‌‌లో కనిపించనున్నాడు కల్యాణ్ రామ్. ఆల్రెడీ ముగ్గురు పాత్రలకు సంబంధించి క్యారెక్టర్స్‌‌ను పరిచయం చేసిన మేకర్స్.. ఆదివారం టీజర్‌‌‌‌తో మరింత బజ్ క్రియేట్ చేశారు.

మంజునాథ్, సిద్ధార్థ్​, మైఖేల్ అనే మూడు పాత్రల్లో వేర్వేరు వేరియేషన్స్ చూపించాడు కల్యాణ్ రామ్. మైఖేల్‌‌కి వచ్చిన సమస్య నుంచి తప్పించుకోవడానికి ప్రపంచంలో తనని పోలిన వ్యక్తుల కోసం వెతుకుతూ మిగిలిన ఇద్దరి దగ్గరకి చేరుకుంటాడు. తమలాగే ఉన్న మైఖేల్ వల్ల ఆ ఇద్దరూ ఎలాంటి ప్రమాదాలు ఎదుర్కొన్నారనేది కథ. రాజేంద్ర రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రంలో ఆషికా రంగనాథ్ హీరోయిన్‌‌. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌‌‌‌పై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మిస్తున్నారు. జిబ్రాన్ సంగీతం అందిస్తున్నాడు.