జనవరి 14న రిలీజ్ కానున్న ‘కళ్యాణం కమనీయం’

జనవరి 14న రిలీజ్ కానున్న ‘కళ్యాణం కమనీయం’

సంతోష్ శోభన్, ప్రియా భవానీ శంకర్ జంటగా నటించిన చిత్రం ‘కళ్యాణం కమనీయం’. అనిల్ కుమార్ ఆళ్ల దర్శకత్వంలో యూవీ కాన్సెప్ట్స్ సంస్థ నిర్మించింది. సంక్రాంతి సందర్భంగా జనవరి 14న సినిమా ప్రేక్షకుల ముందుకొస్తుంది. గురువారం ట్రైలర్‌‌‌‌ను అనుష్క లాంచ్ చేసి టీమ్‌‌కి బెస్ట్ విషెస్  చెప్పింది. ప్లెజెంట్‌‌గా ఉన్న ట్రైలర్ సినిమాపై ఇంటరెస్ట్ క్రియేట్ చేసేలా ఉంది.  శివ (సంతోష్ శోభన్), శృతి (ప్రియా భవానీ శంకర్) ప్రేమించుకుని పెళ్లి చేసుకుంటారు. పెళ్లైన కొత్తలో సంతోషంగా లైఫ్ లీడ్ చేస్తారు.

శివకు ఉద్యోగం లేకపోవడం శృతికి ఇబ్బందిగా మారుతుంది. భార్యను సంతోషపెట్టేందుకు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంటాడు శివ. ఆ ప్రయత్నాలు ఎలాంటి పరిస్థితులకు తీసుకెళ్లాయి. శివ ఉద్యోగం సంపాదించి శృతిని హ్యాపీగా ఉంచాడా లేదా అనేది ట్రైలర్‌‌‌‌లో ఆసక్తికరంగా చూపించారు. శివకు ఉద్యోగం లేకపోవడం ఈ జంట మధ్య ఎలాంటి మనస్పర్థలకు దారి తీసింది అనేది కూడా ఎమోషనల్‌‌గా పిక్చరైజ్ చేశారు. ఇది ప్రతి భార్య కథ, ప్రతి భర్త కథ, ప్రతి పెళ్లి కథ అంటూ వేసిన క్యాప్షన్స్ స్టోరీకి యాప్ట్ అనిపించాయి. అన్ని ఎమోషన్స్ ఉన్న ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌‌‌‌గా ఈ  చిత్రాన్ని రూపొందించినట్లు తెలుస్తోంది. శ్రావణ్ భరద్వాజ్ సంగీతం ఇంప్రెస్ చేస్తోంది.