రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు వైద్య శిబిరాలలో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 51 లక్షల 86 వేల 486 మంది కంటి పరీక్షలు చేయించుకున్నారు. కంటి వెలుగు కార్యక్రమంలో మొత్తం ఇవాళ్టి వరకు 9 లక్షల 65 వేల 249 మందికి కంటి అద్దాలు ఇచ్చారు.
కంటి వెలుగులో ఇప్పటివరకు మొత్తం 51,86,486 మందికి కంటి పరీక్షలు చేయగా.. ఇందులో మొత్తం 9,65,249 మందికి రీడింగ్ గ్లాసెస్ పంపిణీ చేశారు. అలాగే మొత్తం 6,72,276 మంది ప్రిస్కిప్షన్ గ్లాసెస్ కోసం రెఫర్ చేశారు. కంటి చేసిన వారిలో కళ్ల సమస్యలు లేనివారు 35,48,847 మంది ఉన్నారు.
