కరీంనగర్ జిల్లాలో పోలీసుల డ్రంక్ అండ్ డ్రైవ్ దందా... వాహనదారుల నుంచి భారీగా వసూళ్లు..!

కరీంనగర్ జిల్లాలో పోలీసుల డ్రంక్ అండ్ డ్రైవ్ దందా... వాహనదారుల నుంచి భారీగా వసూళ్లు..!

డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల నిత్యం ఎంతోమంది బలవుతున్న సంగతి తెలిసిందే. తాగి వాహనాలు నడిపేవారు వారి ప్రాణాలు పణంగా పెట్టడమే కాకుండా ఎదుటివారి పట్ల యమకింకరులుగా మారుతున్నారు. పోలీసులు ఎప్పటికప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ లు నిర్వహిస్తూ కట్టడి చేస్తున్నా ప్రమాదాలు తగ్గడం లేదు. అయితే.. డ్రంక్ అండ్ డ్రైవ్ ను కట్టడి చేయాల్సిన పోలీసులే కక్కుర్తి పడితే ఇంకేమైనా ఉందా..? కరీంనగర్ జిల్లాలో ఇదే జరిగింది. పోలీసులే డ్రంక్ అండ్ డ్రైవ్ దందాకు తెరలేపారు. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి..

కరీంనగర్ జిల్లాలో ట్రాఫిక్ పోలీసుల డ్రంక్ అండ్ డ్రైవ్ దందా బట్టబయలయ్యింది. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో వాహనదారుల నుంచి భారీగా వసూళ్లు దండుకుంటున్నారని ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి. 130 కేసుల్లో సుమారు రూ.20 లక్షలు వసూలు చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. 

కోర్టును తప్పుదారి పట్టించి అసలు నిందితుల స్థానంలో ఇతరులను హాజరు పరిచినట్లు తెలుస్తోంది.ఈ ఘటనపై సీరియస్ అయిన ఉన్నతాధికారులు ప్రాథమిక విచారణ అనంతరం ముగ్గురు ట్రాఫిక్ పోలీసులను సస్పెండ్ చేశారు.ఈ ఘటనపై శాఖాపరమైన విచారణ జరుపుతున్నారు.