దేశంలో ఎల్ నినో ప్రభావం గట్టిగానే కనిపిస్తోంది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో చాలా తక్కువ వర్షపాతం నమోదవ్వటంతో కరువు పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీంతో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కృత్రిమ వర్షాలు కురపించేందుకు మేఘమథనం చేపట్టనుంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా దాదాపు పూర్తయ్యాయి.
మేఘమథనం కోసం మూడు కమిటీలను ఏర్పాటు చేసి కార్యాచరణ మొదలుపెట్టినట్లు ప్రభుత్వం ఎన్.చలువరస్వామి 2026 ఆగస్టు 25న తెలిపారు. రెండు రోజుల్లో క్లౌడ్ సీడింగ్ చేపట్టనున్నట్లు చెప్పారు. ఇప్పటికీ దీనికి సంబంధించి రెండు దఫాలుగా సమావేశాలు జరిపినట్లు చెప్పారు.ఈ ప్రాజెక్టుకు కోసం 27 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు.
ఇప్పటి వరకు కర్ణాటకలో మూడు సార్లు క్లౌడ్ సీడింగ్ చేపట్టారు. 18 నుంచి 20 శాతం సక్సెస్ రేట్ ఉన్నట్లు చెప్పారు. తమ ప్రభుత్వం 30 శాతం ఫలితాల కోసం ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. దీంతో వ్యవసాయ, తాగు నీటి అవసరాలకు నీటి కొరత ఉండదని తెలిపారు.
జలవనరుల శాఖ ఆధ్వర్యంలో నాలుగు రెవెన్యూ డివిజన్లలో క్లౌడ్ సీడింగ్ చేపట్టనున్నట్లు చెప్పారు మంత్రి. మేఘమథనం చేసిన 15 కిలోమీటర్ల పరిధిలో వర్షాలు కురుస్తాయని తెలిపారు. 27 కోట్ల రూపాయలతో 60 రోజులు మేఘమథనం ఉంటుందన్నారు. దాదాపు 200 గంటలు ఉంటుందన్నారు. విమానాలు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు క్లౌడ్ సీడింగ్ లో పాల్గొంటాయని తెలిపారు.
సెప్టెంబర్ లో దట్టమైన మేఘాలు ఉంటాయని.. అక్టోబర్ లో ఆ ప్రభావం తగ్గుతుందన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఆగస్టు నెలాఖరు నుంచి సెప్టెంబర్ అక్టోబర్ లో సగం నెలవరకు క్లౌడ్ సీడింగ్ చేపట్టున్నట్లు చెప్పారు. కృత్రిమ వర్షాలతో నీరు వృధా కాకుండా ముందస్తుగానే చెరువులు, కుంటల మరమ్మతులు చేపట్టినట్లు తెలిపారు.
