కోలీవుడ్తో పాటు టాలీవుడ్లోనూ స్టార్ డమ్ తెచ్చుకున్నాడు కార్తీ. ప్రస్తుతం ఆసక్తికరమైన లైనప్ చూసుకెళ్తున్నాడు. తన తదుపరి ప్రాజెక్టులపై వస్తున్న అప్డేట్స్ చూస్తే మాస్ యాక్షన్ నుంచి కంటెంట్ ఆధారిత కథల వరకు విభిన్నమైన ప్రయోగాలతో ముందుకెళ్తున్నాడని తెలుస్తోంది. వాటిలో 'సర్దార్ 2' చిత్రం హాట్ టాపిక్గా మారింది.
ఈ చిత్రం ఫ్రీక్వెల్, సీక్వెల్ అనే రెండు కోణాల్లో సాగే కథనంగా రూపొందుతున్నట్లు సమాచారం. మొదటి భాగంలో చూసిన నేపథ్యాన్ని మరింత విస్తరించేందుకు ఫ్లాష్ బ్యాక్లో సర్దార్ మూలాలు చూపించనుండగా, మరోవైపు ఇన్ స్పెక్టర్ విజయ్ ప్రస్తుత కాల కథనం కొనసాగనుంది. ఈ డ్యూయల్ టైమ్ లైన్ ఫార్మాట్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. అలాగే కార్తీ ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్టులతో బిజీ కాబోతున్నట్టు తెలుస్తోంది.
ప్రధానంగా తెలుగు దర్శకులతో వర్క్ చేయడానికి ఆసక్తి చూపుతున్నాడట. ఇప్పటికే శైలేష్ కొలనుతో 'హిట్’ ది ఫోర్త్ కేస్ అనౌన్స్ చేయగా. తాజాగా 'మ్యాడ్' దర్శకుడు కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో సినిమాను లాక్ చేశాడని సమాచారం. సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిందనుందని టాక్ అలాగే టాలీవుడ్లో మాస్ డైరెక్టర్ గా పేరొందిన బోయపాటి శ్రీను డైరెక్షన్లోనూ తను నటించనున్నాడనే ప్రచారం జరుగుతోంది.
ఇప్పటికే బోయపాటి చెప్పిన కథకు కార్తీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం ఇక విష్ణు వర్షన్, ప్రశాంత్ వర్మతో కూడా సినిమాలు చేయాలని ప్లాన్ చేస్తున్నాడనే న్యూస్ వైరల్ అవుతోంది. ఈ క్రేజీ లైనప్ చూస్తుంటే కార్తీ కెరీర్లో మరింత ముందుకు వెళ్లే దిశగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది.
