ఆదివాసి పిల్లలకు నాట్యం నేర్పుతుంది

ఆదివాసి పిల్లలకు నాట్యం నేర్పుతుంది

తను నేర్చుకున్న కళతో నలుగురికి ఉపయోగపడే పని ఏదైనా చేయాలనుకుంది కౌసల్య శ్రీనివాసన్‌‌‌‌‌‌‌‌. స్వతహాగా భరతనాట్య కళాకారిణి అయిన ఆమెకు ఆదివాసీల పిల్లలకు నాట్యం నేర్పించి, దాని ద్వారా వాళ్లను సొసైటీకి దగ్గర చేయాలనుకుంది. అందుకోసం అమెరికాలో ఉద్యోగం వదులుకుని మరీ ఇండియాకు వచ్చేసింది. 

తమిళనాడు,తిండీవనంలోని ఎ.గోవింద స్వామి గవర్నమెంట్‌‌‌‌‌‌‌‌ ఆర్ట్స్‌‌‌‌‌‌‌‌ కాలేజీలో బిఎస్సీ ఫిజిక్స్‌‌‌‌‌‌‌‌ చదివింది కౌసల్య. తను డాన్సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అవుతానని ఎప్పుడూ అనుకోలేదు.ఒక రోజు కాలేజీ కల్చరల్‌‌‌‌‌‌‌‌ ప్రోగ్రామ్స్‌‌‌‌‌‌‌‌లో తన ఫ్రెండ్స్‌‌‌‌‌‌‌‌ చేసిన భరత నాట్యం చూసి,తానుకూడా నాట్యం నేర్చుకోవాలనుకుంది.అలా చిత్రా విశ్వేశ్వరన్‌‌‌‌‌‌‌‌ దగ్గర భరతనాట్యం నేర్చుకోవడం మొదలుపెట్టింది.భరతనాట్య కళాకారుల్లో టాప్​లో ఒకరిగా నిలిచింది.ఎన్నో ప్రదర్శనలు కూడా ఇచ్చింది.తరువాత ఫుల్‌‌‌‌‌‌‌‌ బ్రైట్‌‌‌‌‌‌‌‌ స్కాలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌ ద్వారా అమెరికా వెళ్లింది కౌసల్య.ఇతర దేశాలతో కల్చరల్‌‌‌‌‌‌‌‌ రిలేషన్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌ పెంచుకోవడానికి గ్రాడ్యుయేషన్‌‌‌‌‌‌‌‌ చదివిన వాళ్లకు, కళాకారులకు యుఎస్‌‌‌‌‌‌‌‌ఎ ఇచ్చే స్కాలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌ ఇది.మసాచుసెట్స్‌‌‌‌‌‌‌‌లోని బ్రిడ్జ్‌‌‌‌‌‌‌‌వాటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టేట్‌‌‌‌‌‌‌‌ యూనివర్సిటీలో భరతనాట్యం ప్రొఫెసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా చేస్తూ... అక్కడ కూడా ఎన్నో ప్రదర్శనలు ఇచ్చింది. 

ఇండియాలోని ఆదివాసి తెగకు భరతనాట్యం నేర్పించాలని అమెరికా వదిలి మళ్లీ ఇక్కడికే వచ్చేసింది.ఎన్నో ఏండ్ల నుంచి ఆదివాసి తెగలకు సంబంధించిన ఆడవాళ్లు వాళ్ల  గూడేల్లోనే మగ్గిపోతున్నారు. బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా బతికేవాళ్లూ చాలామందే ఉన్నారు.సరైన సదుపాయాలు లేకపోవడం వల్ల చదువుకు దూరం అవుతున్నారు. దానికితోడు చిన్న వయసులోనే పెండ్లిండ్లల వల్ల అక్కడి ఆడబిడ్డల జీవితం వంటింటికే పరిమితం అవుతోంది.ఎప్పటికైనా వాళ్లలో మార్పు తేవడానికి కృషి చేయాలనుకునేది. 

డాన్స్​ స్కూల్​ పెట్టి..
తరువాత కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పరంగా అమెరికా వెళ్లినప్పటికీ,ఎప్పటికైనా తను అనుకున్నది చేయాలని డిసైడ్​ అయింది.అందుకే ఇప్పుడు తమిళనాడులోని విల్లుపురం వచ్చి ఇరులార్‌‌‌‌‌‌‌‌ ఆదివాసి తెగ పిల్లలకు ఉచితంగా భరతనాట్యం నేర్పిస్తోంది. వాళ్లకోసం ప్రత్యేకంగా ‘సునర్థక’ అనే డాన్స్‌‌‌‌‌‌‌‌ స్కూల్‌‌‌‌‌‌‌‌ పెట్టింది.ఈ స్కూల్లో సుమారు 50 మంది పిల్లలు ఉన్నారు.వాళ్లలో తొమ్మిదేండ్ల వయసున్న పిల్లల దగ్గరనుంచి ఇంటర్ చదివే వాళ్ల వరకు ఉన్నారు.కౌసల్య కూతురు శృతి కూడా భరత నాట్య డాన్సర్.తను కూడా ఈ పిల్లలకు నాట్యం నేర్పడంలో తల్లికి సాయం చేస్తోంది. 

బయటకు రావాలని..
‘‘ఆదివాసి పిల్లలు వాళ్ల తల్లిదండ్రుల్లా గూడేల్లోనే ఉండి మామూలు లోకంలోకి రాలేకపోతున్నారు.వాళ్లకు నాట్యం నేర్పించడం వల్ల  బయటి ప్రపంచం ఎలా ఉంది? జీవితంలో ఏం చేయాలన్న విషయాలు తెలుస్తాయి.వాళ్లు మిగతా వాళ్లకు తీసిపోకుండా ఉండేందుకే నాట్యం నేర్పిస్తున్నా. 

అనుకున్నంత ఆదరణ రాలేదు..
మొదట ఇరులార్‌‌‌‌‌‌‌‌ తెగ ప్రజల దగ్గరకు వెళ్లి డాన్స్‌‌‌‌‌‌‌‌ నేర్పిస్తా అని చెప్పినప్పుడు,వాళ్లలో ఒక్కరు కూడా ముందుకు రాలేదు.ఆ పిల్లల తల్లిదండ్రులు ‘మాకు నాట్యం వద్దు,ఏం వద్దు’ అని ముఖం మీదనే తలుపులు వేసేవాళ్లు.అప్పుడు నేను ఈ తెగ వాళ్లని ఎలాగైనా మార్చాలనుకున్నా.ఆ పట్టుదలతోనే ఆదివాసి తెగల హక్కుల కోసం పోరాడుతున్న కె. చంద్రు (ఒకప్పటి మద్రాస్‌‌‌‌‌‌‌‌ హైకోర్ట్‌‌‌‌‌‌‌‌ జడ్జి),మద్రాస్‌‌‌‌‌‌‌‌ గవర్నమెంట్‌‌‌‌‌‌‌‌ కాలేజి ప్రొఫెసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రభా కల్విమణిని కలిసి,నాకు సాయం చేయమని అడిగా.వాళ్ల చొరవతో ఆదివాసీల్లో అవేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నెస్‌‌‌‌‌‌‌‌ తెప్పించగలిగా.అప్పటినుంచి పిల్లలు డాన్స్‌‌‌‌‌‌‌‌ నేర్చుకునేందుకు ముందుకొస్తున్నారు” అని చెప్పింది కౌసల్య.   

‘‘నేను నాట్యం నేర్పిస్తున్న వాళ్లలో కనీసం ఇద్దరు పిల్లలు గొప్పవాళ్లైనా నాకు సంతోషమే.నాట్యం నేర్పించే టప్పుడు అందరినీ సమానంగా చూస్తా. ఒకేలా నేర్పిస్తా.పిల్లలు కూడా ఇప్పుడు బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.వీలైనంత ఎక్కువ మందికి భరతనాట్యం నేర్పిస్తా.ఈ మధ్య కాలంలో చాలా తక్కువమంది నాట్యం నేర్చుకుంటున్నారు.ఈ పిల్లల ద్వారా అయినా నాట్య కళకు మళ్లీ వైభవం వస్తుందని ఆశిస్తున్నా.ఈ పిల్లలు డెవలప్‌‌‌‌‌‌‌‌ అయ్యేందుకు నా వంతు ప్రయత్నం నేను చేస్తా.వీళ్లకు ఫుల్ బ్రైట్‌‌‌‌‌‌‌‌ స్కాలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌ వచ్చేలా చేసి, విదేశాలకు వెళ్లేలా చేయడం నా డ్రీమ్‌‌‌‌‌‌‌‌.’’