KCR Birthday : ఎమ్మెల్యేకు తప్పిన ప్రమాదం

KCR Birthday : ఎమ్మెల్యేకు తప్పిన ప్రమాదం

సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ కార్యకర్తలు, నేతలు వేడుకలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా అంబర్ పేట్ నియోజకవర్గంలో కాచిగూడ డివిజన్లో ఏర్పాటు చేసిన పుట్టినరోజు సంబరాలలో అపశృతి చోటు చేసుకుంది. బాణా సంచాలు కాల్చడంతో  నిప్పురవ్వలు ఒక్కసారిగా వచ్చి అక్కడ డెకరేషన్ గా చేసిన బెలూన్లపై పడ్డాయి. దీంతో  ఎమ్మెల్యే, కార్పొరేటర్, కార్యకర్తలు పరిగెత్తే ప్రయత్నం చేశారు. ఈ తోపులాటలో ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ఒక్కసారిగా కిందపడిపోయారు. గాయాలేమీ కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. దీంతో ఎమ్మెల్యేకుపెను ప్రమాదం తప్పింది.