మూడో రోజూ కేసీఆర్ అసెంబ్లీకి రాలే

మూడో రోజూ కేసీఆర్ అసెంబ్లీకి రాలే

హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ అధ్యక్షుడు, అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ మూడో రోజూ సభకు రాలేదు. బడ్జెట్ సెషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఆయన దూరంగా ఉన్నారు. గురువారం అసెంబ్లీ, కౌన్సిల్ జాయింట్ సెషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై ప్రసంగించారు. శుక్రవారం అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానం ప్రవేశపెట్టి చర్చించారు. 

ఈ రెండ్రోజులు కూడా సభకు కేసీఆర్ రాలేదు. దీంతో అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నేత చైర్ ఖాళీగా కనిపించింది. సభా నాయకుడి హోదాలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నప్పుడు ఇదే విషయాన్ని పలుమార్లు ప్రస్తావించారు. సీనియర్ సభ్యుడైన కేసీఆర్.. సభకు వచ్చి ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇస్తే ఆయన గౌరవం పెరుగుతుందే తప్ప.. తగ్గదన్నారు. ఈ నేపథ్యంలో శనివారం బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో సభలో కేసీఆర్ ఉంటారని బీఆర్ఎస్ వర్గాలు తెలిపినా.. ఆయన మాత్రం సభకు రాలేదు. సోమవారం బడ్జెట్‌‌‌‌పై జనరల్ డిస్కషన్‌‌‌‌తో పాటు పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ఇరిగేషన్ డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌లోని లోపాలపై శ్వేతపత్రం విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. 

ఈ క్రమంలోనే ఆదివారం సాయంత్రం సీఎల్పీ సమావేశం నిర్వహించనున్నారు. కాగా, మంగళవారం బీఆర్ఎస్ పార్టీ చలో నల్గొండకు పిలుపునివ్వగా, అదే రోజు రాష్ట్ర ప్రభుత్వం మేడిగడ్డ బ్యారేజీ సందర్శనకు అన్ని పార్టీల ఎమ్మెల్యేలను తీసుకెళ్తోంది. ఈ కార్యక్రమానికి ప్రధాన ప్రతిపక్ష నేతను ఆహ్వానించే బాధ్యతను సీఎం రేవంత్ మంత్రి ఉత్తమ్ కుమార్‌‌‌‌‌‌‌‌ రెడ్డికి అప్పగించారు. కానీ మేడిగడ్డ టూర్‌‌‌‌‌‌‌‌కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలెవరూ హాజరుకారని కేటీఆర్ సంకేతాలు ఇచ్చారు. బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ ఎమ్మెల్యేలు, ఇతర లీడర్లు చలో నల్గొండ సభకే రావాలని ఆయన పిలుపునిచ్చారు.