కుల వృత్తులకు ప్రభుత్వం అండగా నిలుస్తుంది: మంత్రి శ్రీనివాస్ గౌడ్

కుల వృత్తులకు ప్రభుత్వం అండగా నిలుస్తుంది:  మంత్రి శ్రీనివాస్ గౌడ్

జనగామ జిల్లా: కుల వృత్తులకు,  రైతు సోదరులకు కేసిఆర్ ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ చెప్పారు. నర్మెట్ట మండలం బొమ్మకూరు రిజర్వాయర్ లో 1.20 లక్షల ఉచిత చేపపిల్లల విడుదల కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

    ఈ సందర్భంగా ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వంలో కులవృత్తులకు న్యాయం జరుగుతుందన్నారు. చేప పిల్లల కోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఇరవై మూడు జిల్లాలకు రెండు కోట్ల రూపాయల నిధులను కేటాయించేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఉచిత చేప పిల్లలు అందించి ముదిరాజు, బెస్త కులస్తులకు అండగా నిలుస్తోందన్నారు. కేసిఆర్ పాలనలో ప్రతి పల్లెలో చెరువులు కుంటలు నిండుకుండలా పొంగాపారుతున్నాయన్నారు. దేశానికి అన్నం పెట్టే స్థాయిలో తెలంగాణ ఎదిగింది.. దేశంలో తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్ స్థానానికి ఎదగడానికి ప్రజాప్రతినిధులం పని చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో  ఎమ్మెల్యేలు ,ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, తాటికొండ రాజయ్య  జిల్లా కలెక్టర్ కె.నిఖిల తదితరులు పాల్గొన్నారు.