కేసీఆర్ సొంత మీడియా చానెల్ మరోసారి V6, వెలుగుపై విషం కక్కింది. హుజురాబాద్ బైపోల్ కోసం వీ6, వెలుగు మీడియా వాహనాలను దుర్వినియోగం చేస్తున్నారంటూ తప్పుడు కథనాన్ని అల్లింది. జగిత్యాల ప్రింటింగ్ ప్రెస్ నుంచి తెల్లవారు ఝామున నిజామాబాద్ కు వెళ్లిన వెహికల్ తిరిగి జగిత్యాలకు వస్తున్న వీడియోని చూపిస్తూ కథను ఊహించుకుంది. బతుకు దెరువు కోసం ఓ డ్రైవర్ తన హైర్ వెహికల్ లో జగిత్యాలకు వస్తువులు సరఫరా చేయడాన్ని హుజురాబాద్ లో బైపోల్ కు ముడిపెట్టింది. నిజామాబాద్ నుంచి జగిత్యాల రూట్ కు హుజూరాబాద్ కు ఏ సంబంధం లేకపోయినా గులాబీ చానెల్ అలవాటుగా కట్టుకథలు వండి వార్చింది. నిజామాబాద్ నుంచి జగిత్యాలకు వస్తువుల డెలివరీకి సంబంధించిన బిల్లులు తిరుగులేని నిజాన్ని నిరూపిస్తున్నాయి. ఆ వస్తువుల్ని అందుకున్నవాళ్లు కూడా ఇదే విషయాన్ని సూటిగా చెప్పారు.

