‘భాగ్‌‌‌‌ సాలే’తో వస్తున్న కీరవాణి కొడుకు శ్రీసింహ

 ‘భాగ్‌‌‌‌ సాలే’తో వస్తున్న కీరవాణి కొడుకు శ్రీసింహ

మత్తు వదలరా, దొంగలున్నారు జాగ్రత్త చిత్రాలతో హీరోగా ఇంప్రెస్ చేసిన కీరవాణి కొడుకు శ్రీసింహా.. త్వరలో ‘భాగ్‌‌‌‌ సాలే’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. ప్రణీత్ సాయి డైరెక్ట్ చేస్తున్న ఈ క్రైమ్ కామెడీ థ్రిల్లర్‌‌‌‌‌‌‌‌ను అర్జున్ దాస్యన్, యష్ రంగినేని, కళ్యాణ్ సింగనమల నిర్మిస్తున్నారు. నేహా సొలంకి హీరోయిన్. కాల భైరవ సంగీతం అందిస్తున్నాడు.

‘ప్రేమ కోసం’ అనే మాస్ సాంగ్‌‌‌‌ను సోమవారం విడుదల చేశారు. కాసర్ల శ్యామ్ లిరిక్స్ రాసిన ఈ పాటను మంగ్లీ ఎనర్జిటిక్‌‌‌‌గా పాడింది. ‘సన్ లైటు, మూన్ లైటు.. మించిందేరా లవ్ లైటూ.. వద్దు చాటు, వద్దు లేటు.. ఉంటే చాలు కొంత చోటు’ అంటూ సాగిన ఈ పాటకు నందినీ రాయ్ తన డ్యాన్స్ మూమెంట్స్‌‌‌‌తో జోష్ తీసుకొచ్చింది. జాన్ విజయ్, నందినీ రాయ్ కీలకపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో రాజీవ్ కనకాల, వైవాహర్ష, సత్య, సుదర్శన్, వర్షిణి ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. షూటింగ్ పూర్తయిన ఈ మూవీ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.