జాతీయ ఉత్తమ నటిగా కీర్తిసురేశ్

జాతీయ ఉత్తమ నటిగా కీర్తిసురేశ్

66వ నేషనల్​ ఫిల్మ్​ అవార్డుల ప్రదానోత్సవం అట్టహాసంగా జరిగింది. సోమవారం ఢిల్లీ విజ్ఞాన్ భవన్ లో జరిగిన కార్యక్రమంలో ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ అవార్డులను అందజేశారు. మహానటి చిత్రంలో సావిత్రి పాత్రలో జీవించిన కీర్తి సురేశ్​జాతీయ ఉత్తమ నటి పురస్కారాన్ని స్వీకరించారు. ఉత్తమ తెలుగు చిత్రంగా నిలిచిన మహానటి తరఫున డైరెక్టర్ నాగ్ అశ్విన్, బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్​గా మహానటి చిత్రానికిగానూ అర్చనా రావు, బెస్ట్ ఒరిజినల్ స్కీన్ ప్లే అవార్డును చి.ల.సౌ మూవీ డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్, బెస్ట్ ఆడియో గ్రఫీ అవార్డును రంగస్థలం చిత్రానికిగానూ రాజాకృష్ణన్, బెస్ట్ మేకప్ అవార్డును ‘ఆ’మూవీకిగానూ రంజిత్ అందుకున్నారు. బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్ అవార్డు ‘ఆ’మూవీకిగానూ శృతి క్రియేటివ్ స్టూడియోకు దక్కింది.