తెలంగాణ రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ గా ఖాజా ముజీబుద్దీన్ బాధ్యతలు స్వీకరించారు.హైదరాబాద్ నాంపల్లిలోని హజ్ హౌస్ లో బాధ్యతలు చేపట్టిన ఖాజా ముజీబుద్దీన్... తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి కామారెడ్డి జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగాతనపై నమ్మకంతో ముఖ్యమంత్రి కేసీఆర్ తనకుఈ పదవీ కట్టబెట్టినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఉర్దూ అకాడమీని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని స్పష్టం చేశారు. అకాడమీకి డైరెక్టర్ లేరని... నెల రోజుల్లో అకాడమీకి శాశ్వత డైరెక్టర్ ని నియమిస్తామని ఖాజా ముజీబుద్దీన్ చెప్పారు. కాగా ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, మహమూద్ అలీ, ఎమ్మెల్సీ కవిత, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఖాజా ముజీబుద్దిన్ ను అభినందించారు.
