- నిమ్స్ డాక్టర్లు మా పాపను కంటికి రెప్పలా కాపాడుతున్నారు: బాలిక తల్లిదండ్రులు
హైదరాబాద్, వెలుగు: ఖమ్మం జిల్లాకు చెందిన బాధిత బాలికకు నిమ్స్ హాస్పిటల్లో ట్రీట్మెం ట్ అందుతోందని.. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని నిమ్స్ డైరెక్టర్ రాహుల్ దేవరాజ్ వెల్లడించారు. ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్‌కు వచ్చిన చిన్నారికి నిపుణులైన డాక్ట ర్లు వైద్యం అందిస్తున్నారని, ప్రభుత్వం నుంచి అందుతున్న తోడ్పాటుతో రూపాయి ఖర్చు లేకుండా పాపకు మెరుగైన చికిత్స అందిస్తున్నట్టు పేర్కొన్నారు.
‘‘పాప సీరియస్ కండిషన్ లో ఉన్నప్పుడు నిమ్స్‌కు తీసుకొచ్చారు. వెంటనే స్పెషలిస్ట్ డాక్టర్ల టీమ్‌తో వైద్యం ప్రారంభించాం. సీటీ స్కాన్, ఎంఆర్‌ఐ స్కాన్ నుంచి బ్లడ్ టెస్టుల వరకు అన్నీ ఆరోగ్యశ్రీ పరిధిలోనే ఉచి తంగా చేశాం. ప్రస్తుతం పాప ఆరోగ్యం నిలకడగానే ఉంది” అని నిమ్స్ డైరెక్టర్ తెలిపారు. చికిత్స, మందులకే కాకుండా.. పాప తల్లిదం డ్రులు ఉండటానికి ప్రత్యేకంగా రూమ్ కేటాయించినట్టు చెప్పారు. ట్రీట్‌మెంట్, మెడిసిన్, ఫుడ్ అన్నీ ఉచితంగా అందిస్తున్నామని డైరెక్టర్ రాహుల్ దేవరాజ్ తెలిపారు.
మందులకు కూడా డబ్బులు అడగలేదు: బాలిక పేరెంట్స్
నిమ్స్ హాస్పిటల్లో తమ పాపను డాక్టర్లు కంటికి రెప్పలా కాపాడుతున్నారని బాలిక తల్లిదండ్రులు తెలిపారు. ‘నిమ్స్‌లో మా పాపను కంటికి రెప్పలా కాపాడుతున్నారు. బయట వేల రూపాయలు అయ్యే టెస్టులు, మందులు ఇక్కడ పైసా తీసుకోకుండా ఇస్తున్నారు. మందుల కోసం కూడా మా దగ్గర డబ్బులు అడగలేదు. మాకు ఉండటానికి రూమ్ ఇచ్చి, తిండి కూడా పెడుతున్నారు’ అని గురువారం ఒక ప్రకటనలో వెల్లడించారు.
