ఖమ్మం జిల్లా లో తీవ్ర విషాదం నెలకొంది. కుటుంబ కలహాలతో ఓ తల్లి తన ఇద్దరు పిల్లలకు విషమిచ్చి ఆత్మహత్యాయత్నం చేసింది. పిల్లల్లో ఒకరు స్పాట్ లోనే చనిపోగా.. మరో కుమారుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. తల్లి ప్రాణాపాయ స్తితిలో కొట్టుమిట్టాడుతోంది. హృదయ విదారకమైన ఘటన ఖమ్మం పట్టణంలోని గాంధీనగర్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
ఖమ్మం జిల్లా గుర్రంపాడుకు చెందిన లింగరాజు, స్వాతి దంపతులు వారికి వేదిక్ కుమార్; తనిష్క్ ఇద్దరు కుమారులు ఉన్నారు. కుటుంబ కలహాలతో గత కొంతకాలంగా గుర్రంపాడునుంచి షిఫ్ట్ అయి ఖమ్మంలోని గాంధీనగర్ లో ఉంటున్నారు. భార్యభర్తల మధ్య తరుచు గొడవలు తలెత్తడం.. శనివారం భర్త ఇంట్లోలేని సమయంలో గొడవలు ముదిరి ఇద్దరు పిల్లలకు ఎలుకల మందు ఇచ్చి తాను ఆత్మహత్యాయత్నం చేసింది స్వాతి. పెద్ద కుమారుడు వేదిక్ కుమార్ స్పాట్ లోనే చనిపోగా.. చిన్నకుమారుడు ఆస్పత్రిలో మృతిచెందాడు. స్వాతి పరిస్థితి విషమంగా ఉంది. చిన్నారుల మృతితో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
