Sidharth and kiara wedding: 65 ఎకరాల ప్యాలెస్‭లో వెడ్డింగ్‭

Sidharth and kiara wedding: 65 ఎకరాల ప్యాలెస్‭లో వెడ్డింగ్‭

బాలీవుడ్ ప్రేమజంట సిద్దార్థ్, కియారాల వివాహ వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. రాజస్థాన్‭లోని  జైసల్మీర్‭లోని సూర్యగఢ్ ప్యాలెస్‭లో వీరిద్దరూ వివాహ బంధంలో అడుగుపెట్టనున్నారు. అయితే పెళ్లికి వీరు పెడుతున్న ఖర్చు చూసి అభిమానులు షాక్ అవుతున్నారు. ఈ సూర్యగఢ్ ప్యాలెస్ గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అంతగా ఖర్చు పెట్టేంత ఏముంది అనుకుంటున్నారు. రాజస్థాన్‭లోని ఈ సూర్యగఢ్ ప్యాలెస్ రాయల్ వెడ్డింగ్స్‭కు నిలయం.  అతిథులకు విలాసవంతమైన హోటల్‌ గదులు, బెడ్‌రూమ్‌లు, పెద్ద తోటలు, ఒక కృత్రిమ సరస్సు, ఒక వ్యాయామశాల, ఒక ఇండోర్ స్విమ్మింగ్ పూల్, విల్లాలు, 2 పెద్ద రెస్టారెంట్‌లు ఉన్నాయి. అయితే ప్రస్తుతం కియారా, సిద్దార్థ్ వెడ్డింగ్ కారణంగా ఈనెల 11 వరకు హోటల్ బుకింగ్‭లకు ఈ ప్యాలెస్ అందుబాటులో లేదని ప్యాలెస్ అధికారులు వెల్లడించారు. 

సుమారు 200 మంది అతిథులతో జరిగే వివాహ వేడుకలకు సుమారు రూ.1.75 కోట్లు ఖర్చు అవుతుంది. ఈ మొత్తంలో అల్పాహారం, మధ్యాహ్న భోజనం, డిన్నర్ ఉంటాయి. అయితే ఇందులో ఆల్కహాల్ ఛార్జీలు ఉండవు. ఆల్కహాల్ వంటివి కూడా ఏర్పాటు చేస్తే అందుకు అదనంగా ఖర్చు అవుతుంది. ఈ ప్యాలెస్‭లో ఒక్కరోజు బస చేస్తే రూ.80,000 వరకు ఛార్జ్ చేయనున్నారు. ట్యాక్స్ వంటివి అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. దాదాపు 65 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ హోటల్ నిర్మాణాన్ని పసుపు రాళ్లను ఉపయోగించి అద్భుతంగా తీర్చిదిద్దారు. ఇదిలా ఉంటే సూర్యగఢ్ ప్యాలెస్‭లో మూడు రోజులుగా సిద్ధార్థ్, కియారాల వివాహ వేడుకలు జరుగుతున్నాయి. పెళ్లి వేదికను పింక్ లైట్లతో అందంగా అలంకరించారు. ఇప్పటికే మెహందీ, సంగీత్ వేడుకలకు సంబందించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.