కికు యనమల, కశిష్ ఖాన్ జంటగా నటిస్తున్న సినిమా 'చిరంజీవి'. శుభ సాయి వెంకట్ దర్శకత్వంలో దీప్తి నడిమింటి నిర్మిస్తున్నారు. తనికెళ్ల భరణి, ఈశ్వరీ రావు, గోపరాజు రమణ, శ్రీకాంత్ భరత్, వైవా రాఘవ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సోమవారం ఈ మూవీ గ్లింప్స్ లాంచ్ ఈవెంట్ను నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో కికు యనమల మాట్లాడుతూ.. 'మాదొక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఈ సినిమా చేసేప్పుడు మా ఫ్యామిలీ మెంబర్స్ భయపడ్డారు.
ఇండస్ట్రీలోకి అడుగుపెట్టేందుకు గుండె ధైర్యం ఉంటే చాలు అనిపించింది. ఈ రోజు ప్రేక్షకులు కంటెంట్ బాగుంటే చాలు ఆదరిస్తున్నారు. మా మూవీ కంటెంట్ చాలా బాగుంది. కొత్త వాళ్లినా బాగా తెరకెక్కించారే. బాగా పెర్ఫార్మ్ చేశారే అనేలా మా సినిమా ఉంటుంది' అని అన్నాడు.
డెక్ట్రోకార్డియా (కుడివైపు గుండె ఉండే అరుదైన పరిస్థితి) అనే పాయింట్ చుట్టూ డ్రామా అల్లుకున్న కథతో ఈ సినిమాను ఆసక్తికరంగా తెరకెక్కించామని దర్శకుడు శుభ సాయి వెంకట్ చెప్పాడు. బలమైన కథాకథనం, క్యారెక్టర్స్తో ఈ సినిమాను నిర్మించామని నిర్మాత దీప్తి నడిమింటి అన్నారు. నటులు రాజీవ్, రామ్ జగన్, మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర, ఎడిటర్ ఛోటా కె ప్రసాద్, ఆర్ట్ డైరెక్టర్ మూర్తి పాల్గొన్నారు.

