
యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తోన్న లేటెస్ట్ మూవీ " సమ్మతమే" ఫస్ట్ లుక్ నుంచే ఎంతగానో ఆకట్టుకుంటున్న ఈ సినిమా పైన ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి. ఇప్పటికే టీజర్, సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ రాగా కొద్దిసేపటి క్రితం తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సినిమా థియేట్రికల్ ట్రైలర్ను విడుదల చేశారు. 'ఏ ఇంటికైనా ఆడపిల్లే మహాలక్ష్మీ. వాళ్లు లేని ఇళ్లు ఇలాగే ఉంటుంది' అనే డైలాగ్తో మొదలైన ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకునేలా సాగింది." ఇన్నాళ్లు గోల్డ్ చైన్ వేసుకున్నందుకు ఇన్నాళ్లకు వచ్చిందిరా గోల్డెన్ ఆపర్చునిటీ', లైఫ్ లో గర్ల్ రావడమే గోల్, 'నీకు ఏ అమ్మాయి కరెక్ట్ కాదు. అద్దంలో మొహం చూసుకుని బొట్టు పెట్టుకుని తాళి కట్టుకో' అనే డైలాగులు ఆకట్టుకుంటున్నాయి. పెళ్లి, అమ్మాయి కోసం ఎదురుచూసే ఓ యువకుడి కథగా ఈ సినిమా ఉంటుందని తెలుస్తోంది. పక్కింటి కుర్రాడిలా కిరణ్, అందంగా చాందినీ చౌదరి లుక్స్ ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రం ద్వారా గోపీనాథ్ రెడ్డి అనే కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ ఆధ్వర్యంలో రిలీజ్ కానున్న ఈ సినిమా జూన్ 24 న గ్రాండ్ గా విడుదల కానుంది.