నేడు బీజేపీ స్టేట్ చీఫ్​గా కిషన్​ రెడ్డి బాధ్యతలు

నేడు బీజేపీ స్టేట్ చీఫ్​గా కిషన్​ రెడ్డి బాధ్యతలు

హైదరాబాద్: బీజేపీ స్టేట్ చీఫ్​గా కిషన్ రెడ్డి శుక్రవారం ఉదయం 11.45 గంటలకు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించను న్నారు. ఉదయం 7.30 గంటలకు పాతబస్తీలోని భాగ్యలక్ష్మీ అమ్మవారి గుడికి వెళ్లి ప్రత్యేక పూజలు చేస్తారు. తర్వాత జగ్జీవన్ రాం, జ్యోతి బాపూలే విగ్రహాలకు నివాళులర్పిస్తారు. 

ఆ తర్వాత బషీర్​బాగ్​లోని కనకదుర్గమ్మ గుడిలో పూజలు చేసి, అక్కడి నుంచి ట్యాంక్​బండ్​కు వెళ్లి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివా ళులర్పిస్తారు. అనంతరం అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్​పార్కులోని అమరవీరుల స్థూపానికి నివాళులర్పిస్తారు. అక్కడి నుంచి ఉదయం 11. 30 గంటలకు ర్యాలీగా బయలుదేరి బీజేపీ స్టేట్ ఆఫీసుకు చేరుకుంటారు.