రాష్ట్రంలోనూ  ఫోన్లు ట్యాప్ చేస్తున్రు

రాష్ట్రంలోనూ  ఫోన్లు ట్యాప్ చేస్తున్రు

ట్యాపింగ్‌‌‌‌‌‌‌‌లో సీఎం కేసీఆర్‌‌ ఒక ఆకు ఎక్కువే చదివిండు: కోదండరాం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం కొన్నేళ్లుగా ఫోన్ ట్యాపింగ్‌‌‌‌‌‌‌‌కు పాల్పడుతోందని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం ఆరోపించారు. ఐదారేళ్ల కిందట ఒకసారి కలిసినప్పుడు ఫోన్ ట్యాపింగ్ కోసం రాష్ట్ర పోలీసులు ఉపయోగిస్తున్న ఇజ్రాయెల్ టెక్నాలజీ గురించి కేసీఆర్ తమకు చెప్పారని గుర్తుచేశారు. శనివారం కోదండరాం మీడియాతో మాట్లాడారు. ‘‘ఫోన్ ట్యాపింగ్ విషయంలో కేసీఆర్‌‌ సర్కారు ఒక ఆకు ఎక్కువే చదివింది. 2015 లోనో, 2016 లోనో అనుకుంటా. ఫోన్లన్నీ ట్యాప్ చేస్తరయా.. మావోళ్లు ఎక్కడో ఇజ్రాయెల్‌‌‌‌‌‌‌‌కెళ్లి ఏదో తెచ్చిండ్రట. మీరు ఎక్కడున్నరో గుర్తుపడ్తరట. మనం మాట్లాడితే వింటరట. అందుకే ఎక్కడబడితే అక్కడ.. ఏదిపడితే  అది మాట్లాడొద్దు. చాలా జాగ్రత్తగా ఉండాలె” అని అప్పట్లోనే హెచ్చరించారని చెప్పారు. తాము ఏదైనా కార్యక్రమం చేయాలని ఫోన్‌‌‌‌‌‌‌‌లో అనుకున్నా తెల్లారే సరికి పోలీసులు ఇంటి ముందు ఉంటున్నారని, పత్రికా ప్రకటన ఇవ్వకున్నా పోలీసులకు  తెలుస్తోందని అన్నారు.