అయ్యర్‌‌‌‌ ఫిట్‌‌నెస్‌‌పై సస్పెన్స్‌‌!

అయ్యర్‌‌‌‌ ఫిట్‌‌నెస్‌‌పై సస్పెన్స్‌‌!

ముంబై :  ఐపీఎల్ ముంగిట టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్, కోల్‌‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్  ఫిట్‌‌నెస్‌‌పై సస్పెన్స్‌‌ నెలకొంది. అతనికి మళ్లీ గాయం అయిందని, ఐపీఎల్‌‌లో కొన్ని మ్యాచ్‌‌లకు దూరం అయ్యే అవకాశం ఉందని  తెలుస్తోంది. విదర్భతో రంజీ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌‌ రెండో ఇన్నింగ్స్‌‌లో 95 రన్స్‌‌ చేసిన తర్వాత అయ్యర్ వెన్నునొప్పికి గురయ్యాడు.

దాంతో  చివరి రెండు రోజుల్లో ఫీల్డింగ్‌‌కు రాలేదు.  అతని ఫిట్‌‌నెస్ విషయంలో భిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. శ్రేయస్ బాగానే ఉన్నాడని, రెండు మూడు రోజుల్లో తను కేకేఆర్‌‌‌‌ ప్రీ ఐపీఎల్‌‌ క్యాంప్‌‌లో చేరుతాడని ముంబై టీమ్ మేనేజర్‌‌‌‌ భూషణ్ పాటిల్ తెలిపారు.

కానీ, శ్రేయస్‌‌ కేకేఆర్‌‌‌‌ టీమ్‌‌లో జాయిన్ అయ్యే విషయమై ఇప్పటిదాకా తమకు ఎలాంటి సమాచారం లేదని కేకేఆర్‌‌‌‌ అధికారులు చెబుతున్నారు. ఇంకోవైపు శ్రేయస్‌‌ గానీ, తన మేనేజ్‌‌మెంట్ టీమ్‌‌ గానీ అతని ఫిట్‌‌నెస్‌‌ స్టేటస్‌‌ గురించి ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.