IPL 2026: ఐపీఎల్ 2026లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన పోరులో నిర్ణీయ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి కోల్కతా నైట్ రైడర్స్ జట్టు 181 పరుగులు చేసింది. టాస్ ఓడిన తర్వాత బ్యాటింగ్ కి వచ్చిన కేకేఆర్ కి ఆదిలోనే బిగ్ షాక్ తగిలింది. 15 పరుగుల వద్ద ఓపెనర్ ఫిన్ అలెన్ (9) తక్కువ పరుగులకే ప్రిన్స్ యాదవ్ బౌలింగ్ లో దిగ్వేశ్ రాఠీకి క్యాచ్ ఇచ్చి డగౌట్ కి వెళ్లిపోయాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన రఘువంశీ, కోల్కతా కెప్టెన్ అజింక్య రహానేతో కలిసి 52 బంతుల్లోనే 84 పరుగులు భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.
రహానే– రఘువంశీ అద్భుతంగా ఆడుతూ కేకేఆర్ స్కోర్ బోర్డుని ముందుకు నడిపిస్తున్న క్రమంలో 99 పరుగుల వద్ద రహానే ( 23 బంతుల్లో 4 ఫోర్లు 2 సిక్సులతో 41 పరుగులు )ని దిగ్వేశ్ రాఠీ బౌలింగ్ లో మహమ్మద్ షమీకి క్యాచ్ ఇచ్చి మైదానం వీడాడు. ఆ తర్వత కాసేపటికే హాఫ్ సెంచరీ దిశగా ప్రయాణిస్తున్న రఘువంశీ ( 33 బంతుల్లో 5 ఫోర్లు 2 సిక్సులతో 45 పరుగులు ) మణిమారన్ సిద్ధార్థ్ బౌలింగ్ లో ఐడెన్ మార్ క్రమ్ కి క్యాచ్ ఇచ్చి డగౌట్ కి వెళ్లిపోయాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన హార్డ్ హిట్టర్ రింకు సింగ్ కేవలం 4 పరుగులు మాత్రమే చేసి అవేశ్ ఖాన్ బౌలింగ్ లో వెనక్కివెళ్లిపోయాడు. దీంతో 111 పరుగులకే కీలకమైన 4 వికెట్లని కోల్పోయి కష్టాల్లో పడింది.
Also Read ; రహానే, రఘువంశీ మెరుపు బ్యాటింగ్
ఇక తర్వాత మైదానంలోకి వచ్చిన రోవ్మన్ పావెల్ ( 24 బంతుల్లో 4 ఫోర్లు 2 సిక్సులతో 39 పరుగులు ) – కామెరూన్ గ్రీన్ ( 24 బంతుల్లో 3 ఫోర్లు 1 సిక్సుతో 32 పరుగులు ) 11 నుంచి15 ఓవర్ల మధ్య నెమ్మదిగా బ్యాటింగ్ చేయడంతో.. కేకేఆర్ నెట్ రన్ రేట్ బాగా తగ్గిపోయింది. అనంతరం మెల్లిగా క్రీజులో సెట్ అయిన తర్వాత అదిరిపోయే షాట్స్ తో లక్నో బౌలర్లని భయపెట్టారు. ముఖ్యంగా చివరి ఓవర్లో రెండు ఫోర్లతో సహా మొత్తం 12 పరుగులు రాబట్టి కేకేఆర్.. 20 ఓవర్లలో 181 పరుగులు చేయగా.. లక్నో ముందు 182 పరుగుల టార్గెట్ పెట్టింది. ఇక లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్లలో ప్రిన్స్ యాదవ్, మణిమారన్ సిద్ధార్థ్ అవేశ్ ఖాన్, దిగ్వేశ్ రాఠీ తలో వికెట్ పడగొట్టారు.
