IPL 2026: ఐపీఎల్ 2026లో భాగంగా కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ (LSG) మధ్య పోరు జరుగుతుంది. ఈ కీలక మ్యాచులో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కి దిగిన కేకేఆర్ జట్టు 10 ఓవర్లు ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 99 పరుగులు చేసింది. కాగా ఫస్ట్ బ్యాటింగ్ చేసిన కోల్‌కతా టీమ్ కి ఆశించిన స్థాయిలో ఆరంభం లభించలేదు. ఓపెనర్ ఫిన్ అలెన్ మరోసారి తీవ్రంగా నిరాశ పరిచాడు. కేవలం 9 పరుగులు మాత్రమే చేసి ప్రిన్స్ యాదవ్ బౌలింగ్ లో దిగ్వేశ్ రాఠీకి క్యాచ్ ఇచ్చి డగౌట్ కి వెళ్లిపోయాడు.
అనంతరం క్రీజులోకి వచ్చిన రఘువంశీ కేకేఆర్ కెప్టెన్ రహానేతో కలిసి లక్నో బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. ఈ క్రమంలో వీరిద్దరు మధ్య కేవలం 52 బంతుల్లో 84 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. పవర్ ప్లే (6 ఓవర్లు) ముగిసే సమయానికి ఒక వికెట్ నష్టానికి 56 పరుగులు చేశారు. ఇక అనంతరం కేకేఆర్ బ్యాటర్లు గేర్ మార్చారు. అవేష్ ఖాన్ వేసి 6 ఓవర్లో ఏకంగా 16 పరుగులు పిండుకోగా, 9వ ఓవర్లో ఏకంగా 6, 1, 2, 6, 0,0 తో 15 పరుగులు రాబట్టారు.
కోల్‌కతా నైట్ రైడర్స్ బ్యాటర్లు అజింక్యా రహానే, రఘువంశీలని ఔట్ చేసేందుకు లక్నో సూపర్ జెయంట్స్ బౌలర్లు తెగ కష్టపడుతున్నారు. 10 ఓవర్లు ముగిసే సమయానికి 99 పరుగుల వద్ద రహానే ( 23 బంతుల్లో 4 ఫోర్లు 2 సిక్సులతో 41 పరుగులు )ని దిగ్వేశ్ రాఠీ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. ప్రస్తుతం రఘువంశీ ( 29 బంతుల్లో 5 ఫోర్లు 2 సిక్సులతో 42 పరుగులు ), కామెరూన్ గ్రీన్ (0) క్రీజులో కొనసాగుతున్నారు. లక్నో బౌలర్లలో ప్రిన్స్ యాదవ్, దిగ్వేశ్ మినహా మరే బౌలర్ కూడా వికెట్లు తీసుకోలేకపోగా.. ధారళంగా పరుగులని సమర్పించుకున్నారు.
