కొండగట్టు, వెలుగు: జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయానికి రూ.1,08,64,164 ఆదాయం సమకూరింది. శుక్రవారం ఆలయం ఆవరణలో 34 రోజులకు సంబంధించిన 14 హుండీలను లెక్కించారు. ఈవో అంజనా రెడ్డి, ఏఈవో హరిహర్నాథ్, దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ రాజమౌళి, సూపరింటెండెంట్ చంద్రశేఖర్ పాల్గొన్నారు.
