రాయికల్, వెలుగు: చావుబతుకుల్లో ఉన్న ఓ యువకుడిని పోలీసులు కాపాడారు. జగిత్యాల జిల్లా రాయికల్‌కు చెందిన బోడి నాగరాజు సోమవారం పురుగు మందు తాగి తాను చనిపోతున్నట్లు కుటుంబసభ్యులకు ఫోన్ చేసి చెప్పారు.
వారు వెంటనే డయల్100కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. స్పందించిన బ్లూకోల్ట్స్కానిస్టేబుల్ సుమన్ జీపీఎస్ ద్వారా నాగరాజు మూటపల్లి శివారులో ఉన్నట్లు గుర్తించారు. అక్కడికి వెళ్లి పురుగు మందు తాగి పడి ఉన్న నాగరాజును హాస్పిటల్‌కు తరలించడంతో ప్రాణాపాయం తప్పింది.
