కిక్కిరిసిన కొండగట్టు

కిక్కిరిసిన కొండగట్టు

కొండగట్టు, వెలుగు: హనుమాన్ జయంతి సందర్భంగా కొండగట్టుకు భక్తులు సోమవారం భారీగా తరలివచ్చారు. దీంతో ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. జై శ్రీరామ్ నినాదాలతో కొండగట్టు గుట్టలు మార్మోగాయి. గుట్టకు చేరుకున్న దీక్షాపరులు కోనేరులో స్నానమాచరించి, స్వామివారిని దర్శించుకొని మాల విరమణ చేస్తున్నారు. ఆలయ అధికారులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 

మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కొండగట్టు అంజన్న దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా కొండగట్టు చేరుకున్న మంత్రికి ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి దర్శనానంతరం స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.