- కొండాపూర్ కిమ్స్ డాక్టర్ల ఘనత
మాదాపూర్, వెలుగు : మారిషస్‌కు చెందిన ఓ మహిళకు కొండాపూర్ కిమ్స్‌లో అరుదైన సర్జరీ చేశారు. పాంక్రియాస్లో అరుదైన కణితితో బాధపడుతుండగా లాప్రోస్కోపిక్ ద్వారా తొలగించారు. శుక్రవారం కొండాపూర్కిమ్స్లో కన్సల్టెంట్ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, రోబోటిక్ సర్జన్ డాక్టర్ సీహెచ్ నవీన్ కుమార్వివరాలు వెల్లడించారు. మారిషస్‌కు చెందిన మహిళ(55) షుగర్ లెవల్స్తగ్గిపోవడం, వెంటనే భోజనం చేయకపోతే కళ్లు తిరిగి పడిపోతుండడంతో చెక్చేయించగా పాంక్రియాస్లో కణితి ఉన్నట్లు తేలింది.
దీంతో ఇండియాకు తీసుకువచ్చి కొండాపూర్కిమ్స్లో జాయిన్చేశారు. డాక్టర్ సీహెచ్ నవీన్ కుమార్ ఆమెను పరీక్షించగా పాంక్రియాస్లో ఇన్సులినోమా అనే కణితి ఉన్నట్లు గుర్తించారు. అనస్థీషియా టీమ్డా.వీరభద్రరావుతో కలిసి మహిళకు లాప్రోస్కోపిక్ పద్ధతిలో సర్జరీ చేసి కణితి తొలగించారు.
