హైదరాబాద్ నగరంలో ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటు విడ్డూరం : బంజారా సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొర్రా మోతీలాల్ నాయక్

హైదరాబాద్ నగరంలో ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటు విడ్డూరం : బంజారా సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొర్రా మోతీలాల్ నాయక్

పంజాగుట్ట, వెలుగు: హైదరాబాద్ నగరంలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేయడం విడ్డూరంగా ఉందని తెలంగాణ బంజారా సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొర్రా మోతీలాల్ నాయక్ విమర్శించారు. తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన నాయకుల విగ్రహాలను తెలంగాణలో ఏర్పాటు చేస్తారా అని ప్రశ్నించారు. ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌‌‌‌‌‌‌‌క్లబ్‌‌‌‌‌‌‌‌లో ఆయన మాట్లాడారు.

తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఇతర రాష్ట్రాలకు చెందిన నేతల విగ్రహాలు ఏర్పాటు చేస్తూ కాంగ్రెస్​ ప్రభుత్వం ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తోందని ఆరోపించారు. గిరిజనుల ఆరాధ్యదైవమైన సంత్ సేవాలాల్‌‌‌‌‌‌‌‌కు తగిన గుర్తింపు ఇవ్వడంలో సీఎం రేవంత్​రెడ్డి వివక్ష చూపుతున్నారని విమర్శించారు.