- తెలంగాణ ఫిర్యాదుతో ఏపీకి కృష్ణా బోర్డు లేఖ
హైదరాబాద్, వెలుగు: కృష్ణా జలాల్లో నీటి వినియోగంపై వివరణ ఇవ్వాల్సిందిగా ఏపీని కృష్ణా బోర్డు కోరింది. ఇటు శ్రీశైలం, అటు సాగర్ నుంచి ఏపీ విచ్చలవిడిగా జలాలను తీసుకెళ్తున్నదని, ఏపీకి ఇక జలాల్లేవని కృష్ణా బోర్డుకు ఇటీవల తెలంగాణ లేఖ రాసింది. శ్రీశైలం, సాగర్లో ఉన్నవన్నీ తెలంగాణ కోటా జలాలేనని, మరిన్ని జలాలు తీసుకోకుండా ఏపీని అడ్డుకోవాలని బోర్డును తెలంగాణ కోరింది. ఈ క్రమంలోనే తాజాగా ఏపీకి కృష్ణా బోర్డు లేఖ రాసింది. ఇటు సాగర్ ఎడమ కాల్వకు గేజ్ల ఏర్పాటు విషయంపైనా అభిప్రాయాలు చెప్పాలని ఆదేశించింది.
టెలిమెట్రీల కోసం డిమాండ్ చేస్తున్న మన ప్రభుత్వం.. గేజ్ల ఏర్పాటు అవసరం లేదని కృష్ణా బోర్డుకు స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే ఏపీ అభిప్రాయాలు చెప్పాలని బోర్డు లేఖలో వెల్లడించింది. మరోవైపు.. ఏపీ ప్రభుత్వం ఇప్పటిదాకా 665 టీఎంసీలను తరలించుకున్నది. ఒక్క పోతిరెడ్డిపాడు నుంచే 200 టీఎంసీలకుపైగా జలాలను వాడుకున్నది.
