కృష్ణాలో తెలంగాణ సామర్థ్యం పెంచుతున్నది..కేంద్ర జలశక్తి శాఖకు కృష్ణా బోర్డు ఫిర్యాదు

కృష్ణాలో తెలంగాణ సామర్థ్యం పెంచుతున్నది..కేంద్ర జలశక్తి శాఖకు కృష్ణా బోర్డు ఫిర్యాదు

హైదరాబాద్, వెలుగు: కృష్ణా బేసిన్లో లో తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి అనుమతులు లేకుండానే ప్రాజెక్టుల కెపాసిటీని పెంచుతోందని కేంద్రానికి కృష్ణా బోర్డు ఫిర్యాదు చేసింది. అపెక్స్ కౌన్సిల్, సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ), కృష్ణా బోర్డు నుంచి అవసర మైన అనుమతులు లేకుండానే డీపీఆర్ లు తయారు చేస్తోందని ఆరోపించింది. మంగళవారం కేంద్రజలశ క్తి శాఖకు కృష్ణా బోర్డులేఖ రాసింది. డిసెంబర్ 8న ఆం ధ్రప్రదేశ్ జలవనరుల శాఖ తమకు ఫిర్యాదు చేసిందని,దానిపై అమరావతి నుంచి తెలంగాణకు సమాచారం పంపినా ఇప్పటివరకు స్పందన లేదని బోర్డు తెలిపింది. 

ప్రస్తుతం కృష్ణా బోర్డు పరిధి నిర్ధారణ కాలేదని, సుప్రీం కోర్టులో విచారణ జరుగుతున్న నేపథ్యంలో దానిపై నిర్ణయం తీసుకోలేమని పేర్కొంది. రెండు రాష్ట్రాల నుంచి ఎలాంటి డీపీఆర్ లు అందలేదని, ట్రిబ్యునల్ అవార్డు తేలని సమయంలో ఆ డీపీఆర్ లను బోర్డు ఆమోదించవచ్చా అన్నది స్పష్టత లేదని వెల్లడించింది. ఈ విషయంలో ఇప్పటికే సీడబ్ల్యూసీ గైడెన్స్ తీసుకున్నా మని, మరింత క్లారిటీ కావాలని బోర్డు తెలిపింది.