కృనాల్ పాండ్యా ఇంట్లో సందడి

కృనాల్ పాండ్యా ఇంట్లో సందడి

టీమిండియా స్టార్ ఆల్ రౌండర్, లక్నో సూపర్ జెయింట్స్ ఆటగాడు కృనాల్ పాండ్యా (Krunal Pandya) తండ్రయ్యాడు. అతని సతీమణి పంకూరి (Pankhuri) పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ వార్తను స్వయంగా కృనాల్ సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. భార్య, బిడ్డలతో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేశారు. తన బిడ్డకు కవిర్ కృనాల్ పాండ్యా (Kavir Krunal Pandya) అనే పేరు పెట్టడం జరిగిందన్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు వైరల్ గా మారాయి. కృనాల్ దంపతులకు పలువురు శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు. కృనాల్ సోదరుడు స్టార్ ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా (Hardik Pandya) స్పందించారు. హార్ట్ ఏమోజీస్ తో రిప్లై ఇచ్చారు. 

ఇక కృనాల్ పాండ్యా విషయానికి వస్తే.. గత సంవత్సరం వరకు ఐపీఎల్ (IPL)లో రోహిత్ సారధ్యంలో ముంబై ఇండియన్స్ తరపున ఆడాడు. తాజాగా జరిగిన ఐపీఎల్ టోర్నీలో కేఎల రాహుల్ కెప్టెన్సీలో లక్నో సూపర్ జెయింట్స్ కు ప్రాతినిధ్యం వహించాడు. ఇతని సతీమణి పంకూరి శర్మ మోడల్. వీరిది ప్రేమ వివాహం. కొన్ని సంవత్సరాల పాటు డేటింగ్ చేసిన అనంతరం కుటుంబసభ్యుల అనుమతితో 2017లో డిసెంబర్ లో వివాహం చేసుకున్నారు.