బీజేపీ యుద్ధానికి ముందే చేతులెత్తేసింది: కేటీఆర్

బీజేపీ యుద్ధానికి ముందే చేతులెత్తేసింది: కేటీఆర్

బీజేపీ యుద్ధానికి ముందే చేతులెత్తేసిందన్నారు మంత్రి కేటీఆర్.  బీఆర్ఎస్ భవన్ లో మీడియాతో చిట్ చాట్ చేశారు కేటీఆర్. బీజేపీ అభ్యర్థులు ఈ సారి 110 స్థానాల్లో డిపాజిట్ కోల్పోతారని.. . తెలంగాణలో తమకు కాంగ్రెస్ తోనే  పోటీ అని చెప్పారు.  కాంగ్రెస్ కు 40 చోట్ల అభ్యర్థులే లేరని ఎద్దేవా చేశారు. 

కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు. 5గంటల కరెంట్ కూడా ఇవ్వడం లేదని అక్కడి రైతులు రోడ్డెక్కుతున్నారని విమర్శించారు.    బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించి రెండు నెలలైందని.. బీఫారాలు కూడా ఇచ్చామని చెప్పారు. ప్రచారంలో ముందున్నామని.. రిజల్ట్ లో కూడా ముందుంటామని కేటీఆర్ అన్నారు. 

అసెంబ్లీ ఎలక్షన్ల సందర్భంగా హైదరాబాద్ లో తాను రోడ్ షాలు చేస్తానన్నారు  కేటీఆర్. సీఎం కేసీఆర్ వంద సభల్లో పాల్గొంటారని చెప్పారు. TSPSCలో ఉన్న చిన్నచిన్న తప్పులను సరిదిద్దుతామన్నారు. ప్రవళిక ఆత్మహత్యను ప్రతిపక్షాలు రాజకీయాలు చేస్తే.. తాము మాత్రం మానవీయ కోణంలో ఆదుకున్నామన్నారు.   మళ్లీ అధికారంలోకి వస్తే.. రైతు రుణమాపీ చేస్తారా అని మీడియా ప్రశ్నించగా.. మేనిఫెస్టోలో లేకపోతే లేనట్లేనని అన్నారు మంత్రి కేటీఆర్.