ప్రపంచంతో పోటీ పడే విధంగా ప్రభుత్వ విద్య

ప్రపంచంతో పోటీ పడే విధంగా ప్రభుత్వ విద్య

ప్రపంచంతో పోటీ పడే విధంగా ప్రభుత్వ విద్యను అందిస్తున్నామన్నారు  మంత్రి కేటీఆర్. రాజన్నసిరిసిల్ల జిల్లా గంభీరావు పేటలోని పాఠశాల ఆవరణలో శిథిలావస్థలో ఉన్న వాటిని తొలగించి కేజీ టూ పీజీ ఒకే ఆవరణలో ఉండే విదంగా ఏర్పాటు చేస్తామన్నారు.ఎల్లారెడ్డి పేటలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేసే బాధ్యత  తనదేనన్నారు. గవర్నమెంట్ విద్య మొక్కుబడిగా కాకుండా ప్రపంచంతో పోటీ పడే విదంగా అందిస్తున్నామన్నారు.

కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో అత్యధికంగా 940 గురుకుల పాఠశాలలు ఉన్నాయన్నారు. ఉన్నత విద్య కోసం ఫీ రిఎంబర్స్ మెంట్స్, విదేశీ విద్యకోసం జోతిబాపులే, అంబేడ్కర్ ఓవర్సీస్ కింద రూ.20 లక్షలు ఇస్తున్నామన్నారు. టిఎస్ఐపాస్ ద్వారా 14 లక్షల మందికి ఉపాధిని ఇచ్చామన్నారు. సొంతంగా పరిశ్రమలు పెట్టే వారిని ప్రోత్సహించడానికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.

SEE MORE NEWS

గ్లోబల్ మహమ్మారిగా మారిపోయిన సోషల్ మీడియా

న్యూయార్క్ అసెంబ్లీలో ‘కాశ్మీర్’ తీర్మానం

చట్టం తన పని తాను చేసుకుపోతుంది