
గచ్చిబౌలి, వెలుగు: రాయదుర్గం నాలెడ్జి సిటీలోని మై హోమ్ భుజాలో ఏర్పాటు చేసిన గణనాథుడి వద్ద గురువారం లడ్డూ వేలంపాట నిర్వహించారు. హోరాహోరీగా వేలంపాటలో గణేశ్ రియల్ ఎస్టేట్ సంస్థ అధినేత, ఖమ్మం జిల్లా ఇల్లందు గ్రామ వాసి కొండపల్లి గణేశ్ రూ.51,07,777కు లడ్డూను కైవసం చేసుకున్నారు. గతేడాది కూడా ఈయనే రూ.29 లక్షలకు లడ్డూ దక్కించుకున్నారు.