ఫ్యాన్సీ నంబర్ల కోసం లక్షలు కడుతున్నరు

ఫ్యాన్సీ నంబర్ల కోసం లక్షలు కడుతున్నరు
  • ఒక్క నంబరుకు రూ.11.50 లక్షలు
  • నంబర్ల వేలంలో ఆర్టీఏకు కాసుల పంట

హైదరాబాద్, వెలుగు: ఫ్యాన్సీ నంబర్ల వేలంలో ఖైరతాబాద్ ఆర్టీఏ కు కాసుల పంట పండింది. సోమవారం నిర్వహించిన కొత్త నంబర్ సిరీస్ లో ఒక్కరోజే 23,46,321 రూపాయల ఆదాయం సమకూరింది. ఎప్పటి మాదిరిగానే ఆన్ లైన్ నంబర్ క్రేజ్ కొనసాగిం ది. టీఎస్ 09 ఎఫ్ జే 9999 నంబర్ ను హెటిరో డ్రగ్స్ సంస్థ 11,50,050 రూపాయలు పెట్టి సొంతం చేసుకుం ది. గతంలో నూ ఈ నంబర్ ను పది లక్షల రూపాయలకు పైగా వేలం పాటలో సొంతం చేసుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. ఇక 0006 నంబర్ కు వేలంలో 1,53,000 పలకగా…0009 నంబర్ ను 1,26,100 రూపాయలకు ఓ ప్రైవేట్ సంస్థ దక్కించుకుంది. మొత్తంగా సోమవారం నిర్వహించిన వేలంలో 23,46,321 రూపాయలు వచ్చినట్లు జేటీసీ పాండు రంగనాయక్ తెలిపారు.