భారత యువ షట్లర్ 18 ఏళ్ల లక్ష్యసేన్ స్కాటిష్ ఓపెన్ గెలిచాడు. తనదైన ఆటతీరుతో ఆకట్టుకుంటున్న లక్ష్యసేన్.. సీనియర్ ఆటగాళ్ల కన్నా మెరుగ్గా తన ఆట తీరును ప్రదర్శిస్తున్నాడు. ఫైనల్లో వైగర్ కోహెలో పై విజయం సాధించి స్కాటిష్ ఓపెన్‌ను కైవసం చేసుకున్నాడు. సెప్టెంబర్ నుంచి నాలుగు టోర్నీల్లో ఆడిన ఈ యువ షట్లర్ సార్లర్ లక్స్ ఓపెన్, బెల్జియం ఇంటర్నేషనల్, డచ్ ఓపెన్ దక్కించుకున్నాడు. ఐరిష్ ఓపెన్ రెండో రౌండ్లో పరాజయాన్ని చవిచూసిన తర్వాత తన ఆట తీరులో మార్పులు చేసుకున్నాడు లక్ష్యసేన్.
ప్రస్తుతం 41వ ర్యాంకులో ఉన్న లక్ష్యసేన్ స్కాటిష్ ఓపెన్ విజయంతో టాప్ 40వ ర్యాంకులో నిలిచాడు. పుల్లెల గోపిచంద్, ఆనంద్ పవార్, అరవింద్ భట్ తర్వాత స్కాటిష్ ఓపెన్ గెలిచిన నాలుగవ భారతీయుడు లక్ష్యసేన్.


