లంబాడీలు అభివృద్ధి దశలో ముందుకు పోవాలి

లంబాడీలు అభివృద్ధి దశలో ముందుకు పోవాలి

హైదరాబాద్ : ట్రైబల్, లంబాడీల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశపెట్టిందన్నారు బీజేపీ నేత వివేక్ వెంకటస్వామి.  సేవలాల్ మహారాజ్ 282 జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సద్గురు శ్రీ సేవాలాల్ మహారాజ్  282వ జయంతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. హైదరాబాద్  రవీంద్రభారతిలో లంబాడి ఐక్యవేదిక  ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. మంత్రి ఈటల రాజేందర్, ఎమ్మెల్సీ రామచంద్రరావు, మాజీ ఎంపీ, బీజేపీ  నేత  వివేక్ వెంకటస్వామి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన వివేక్ వెంకటస్వామి.. లంబాడాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు తీసుకొస్తామన్నారు. లంబాడీలు అభివృద్ధి దశలో ముందుకు పోవాలన్నారు వివేక్.