పద్మారావునగర్, వెలుగు: సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాళి ఆలయంలో ఆషాఢ బోనాల ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఏడో రోజు ఆదివారం అమ్మవారి ఘటాన్ని మేళ తాళాలు, పోతరాజుల నృత్యాల మధ్య చిలకలగూడలోని ఆలయానికి ఊరేగింపుగా తీసుకెళ్లారు.
అక్కడ భక్తుల పూజల అనంతరం రాత్రికి ఉజ్జయిని టెంపుల్కు చేర్చారు. అమ్మవారి దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో తరలిరాగా.. ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈవో మనోహర్ రెడ్డి తెలిపారు.
