టెక్నాలజీ : నకిలీవి గుర్తించండి

టెక్నాలజీ : నకిలీవి గుర్తించండి

ప్రతి రోజూ ఏదో ఒక అవసరం కోసం ఎన్నో వెబ్​ సైట్స్ వాడాల్సి వస్తుంది. ప్రస్తుతం నకిలీ వెబ్​ సైట్స్ ఎక్కువైపోయాయి. వాటివల్ల యూజర్లు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మరి దీనికి సొల్యూషన్​ ఏంటి? నకిలీ వెబ్​సైట్​లను కనిపెట్టడమే. అదెలాగంటే..

వెబ్​సైట్ ఓపెన్ చేయాలంటే.. ముందుగా ఆ వెబ్​సైట్​కి సంబంధించిన అడ్రస్​ డొమైన్​ నేమ్​ ఇవ్వాలి. వెబ్​సైట్​ పేరు చివర్లో.. com, org, in, edu లాంటివి ఎక్కువగా కనిపిస్తుంటాయి. అయితే నకిలీ వెబ్​సైట్​ల డొమైన్​ పేర్లు అలాకాకుండా తప్పుగా ఉంటాయి. 

    వెబ్​సైట్​ పేరులో URL ఉంటే కచ్చితంగా దానికి ముందు http ఉంటుంది. అలా ఉంటే అది ఒరిజినల్ వెబ్​సైట్. అలాలేదంటే నకిలీ.

    వెబ్​సైట్ ఓపెన్ చేసిన వెంటనే మరో వెబ్​సైట్​కి రీ డైరెక్ట్​ అవుతుంటే కచ్చితంగా అది నకిలీ వెబ్​సైట్​.

    ఒరిజినల్ వెబ్​సైట్స్​లో about us, contact పేజీలు కనిపిస్తాయి. నకిలీ వెబ్​సైట్​లలో ఆ వివరాలు ఉండవు.
    అంతేకాకుండా web of trust అనే వెబ్​సైట్​ వాడి నకిలీ వెబ్​సైట్​లను గుర్తించొచ్చు. 

    గూగుల్ క్రోమ్ బ్రౌజర్​కు ఈ వెబ్​సైట్​ యాడ్ చేసుకోవాలి. ఏదైనా ఒక వెబ్​సైట్​ ఓపెన్ చేస్తే దానిపై గ్రీన్ కనిపిస్తే ఒరిజినల్​, రెడ్ మార్క్​ ఉంటే నకిలీ వెబ్​సైట్​.

    అనుమానాస్పద లింక్​లు, ఫోన్​ నెంబర్లతో వచ్చే మెసేజ్​ల గురించి కంప్లయింట్ చేసేందుకు తెలంగాణ స్టేట్​ సైబర్​ సెక్యూరిటీ బ్యూరో (టీఎస్​సీఎస్​బీ) 8712672222 వాట్సాప్​ నెంబర్​ అందుబాటులో ఉంచింది. అలాంటి లింక్స్ ఏవైనా వస్తే వాటిని ఈ నెంబర్​కు పంపిస్తే వాటిని పరిశీలిస్తుంది. నకిలీవని తేలితే వాటిని పనిచేయకుండా చేస్తుంది ఈ సైబర్ సెక్యూరిటీ బ్యూరో.