పెళ్లికి పంతులే కాదు.. లాయర్ కూడా మస్ట్: నేటి తరం యువత ఆలోచన ఇలా ఎందుకు..?

పెళ్లికి పంతులే కాదు.. లాయర్ కూడా మస్ట్: నేటి తరం యువత ఆలోచన ఇలా ఎందుకు..?

పెళ్లి అంటే రెండు జీవితాలు.. మూడు ముళ్లు.. ఏడు అడుగులు.. ఈ పెళ్లికి పంతులు.. అదేనండీ పూజారి మస్ట్.. పూజారి లేకుండా పెళ్లి ఎలా జరుగుతుంది.. ఇది నిన్నా మొన్నటి వరకు ఉన్న ఆలోచన.. నేటి తరం యువత ఆలోచన మారింది. పెళ్లికి పూజారినే కాదు.. లాయర్ కూడా మస్ట్.. పంతులుతో పాటు లాయర్ సైతం పెళ్లికి పెద్ద దిక్కుగా ఉండాలని కోరుకుంటున్నారంట.. అలా అనుకోవటం కాదు.. పెళ్లికి ముందు లాయర్లను సంప్రదిస్తున్నారంట.. ఎందుకు ఇలా జరుగుతుంది.. నేటి యువత ఆలోచన ఎందుకు ఇలా ఉంది అనే పూర్తి వివరాలు తెలుసుకుందామా..

పెళ్లి విషయంలో నేటి డిజిటల్ యుగం యువతలో ఆలోచన విధానం మారుతోంది. చాలా మంది యువత జీవితంలో కీలక ఘట్టమైన వివాహం చేసుకునేందుకు వెనకడుగు వేస్తున్నారు. ఇందుకు ఉద్యోగం, ఆర్థిక సమస్యలు ఇలా చాలా రకాల కారణాలు ఉన్నాయి. వీటితో పాటు వరుడు, అతడి కుటుంబాలు వరకట్న వేధింపులు, గృహ హింస వంటి అంశాలకు భయపడటం కూడా ఒక కారణం. గతంలో భార్యభర్తల మధ్య గొడవ జరిగితే ఇంట్లోనే పరిష్కరించుకునే వారు.

వివాదం మరీ పెద్దది అయితే పెద్ద మనుషులు సమక్షంలో మాట్లాడి పరిష్కరించుకునే వారు. కానీ ఈ డిజిటల్ యుగంలో ట్రెండ్ మారింది. భార్య, భర్తల మధ్య చిన్న గొడవ జరిగిన ఎవరూ అడ్జస్ట్ కావడం లేదు. సంసారం అన్నాక చిన్న చిన్న గొడవలు కామన్ అని లైట్ తీసుకోవట్లేదు. ముఖ్యంగా ఈ జనరేషన్లో కొందరు అమ్మాయిలు చిన్న చిన్న గొడవలకు కూడా సర్దుకుపోకుండా రోడ్డుక్కెతున్నారు. 

కొందరు పోలీస్ స్టేషన్లు.. ఇంకొందరు కోర్టులను ఆశ్రయిస్తున్నారు. మహిళల రక్షణ కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన వరకట్న వేధింపులు, గృహ హింస వంటి చట్టాలను ఆయుధంగా చేసుకుని భర్త ఫ్యామిలీని బజారుకు ఈడుస్తున్నారు. ఇటీవల ఇలాంటి ఘటనలు చాలా ఎక్కువైపోయాయి. ఇవన్నీ చూస్తోన్న అబ్బాయిలు పెళ్లి అంటేనే జంకుతున్నారు.

ఈ గొడవలు అన్ని మనకు ఎందుకు రా బాబు అనుకుంటా బ్యాచిలర్‎గానే జీవితాన్ని ఎంజాయ్ చేసేందుకు ఇష్టపడుతున్నారు. కొందరు అబ్బాయిలు మాత్రం పెళ్లి చేసుకునేందుకు ధైర్యం చేస్తున్న ముందుగానే జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే పూజారితో పాటు న్యాయవాదిని కూడా పెళ్లి పెద్దగా పెట్టుకుంటున్నారు. వివాహం తర్వాత భార్యతో ఏమైనా గొడవలు జరిగితే లీగల్ ఎదుర్కొనేందుకు ఇలా లాయర్‎ను పెళ్లి పెద్దగా ఆహ్వానించి అతడి సమక్షంలోనే మూడు ముళ్లు వేస్తున్నారు. పెళ్లికి ముందు మాట్లాడుకునే పెట్టిపోతలు కూడా న్యాయవాది సమక్షంలోనే కుదుర్చుకుంటున్నారు. 

భవిష్యత్‎లో వరకట్న వేధింపులు వంటి కేసులను న్యాయపరంగా ఎదుర్కొనేందుకు ఇలా చేస్తున్నారు. తాజాగా ఈ తరహా ఘటన ఒకటి మధ్యప్రదేశ్​‎లోని ఇండోర్ నగరంలో వెలుగులోకి వచ్చింది. వరుడు పెళ్లికి పూజారితో పాటు న్యాయవాదిని కూడా నియమించుకున్నాడు. లాయర్ సమక్షంలో అమ్మాయి మెడలోతాళి కట్టాడు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్‎గా మారడంతో తీవ్ర చర్చకు దారి తీసింది. పెళ్లికి లాయర్ ఏంట్రా అని వినడానికి జోక్‎గానే ఉన్నప్పటికీ.. నేటి యువతలో పెళ్లి విషయంలో మారుతోన్న సామాజిక మార్పును సూచిస్తోంది.